కోలీవుడ్ స్టార్ సూర్యకి తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. 1997లో విడుదలైన `నేరక్కు నేర్`తో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన ఈ టాలెంటెడ్ స్టార్ కి… 2001లో వచ్చిన `నంద` చిత్రం నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఆ తరువాత 2005లో విడుదలైన `గజిని` తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయ్యి… సూర్య స్థాయిని పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `నంద`తో సూర్య కెరీర్‌ని మలుపు తిప్పిన దర్శకుడు బాలా… తాజాగా సూర్యని సంప్రదించి ఓ ఆసక్తికరమైన కథ చెప్పాడట. బాలా చెప్పిన ఇంటెన్స్ యాక్షన్ స్టోరీ నచ్చడంతో… సూర్య కూడా ఈ ప్రాజెక్ట్‌కి వెనువెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాదు… పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. దీంతో… సూర్య, బాలా కాంబినేషన్ కన్ఫర్మ్ అయినట్టేనని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆసక్తికరమైన విషయేమిటంటే… `నంద` తరువాత సూర్య, బాలా కాంబినేషన్లో వచ్చిన `పితామగన్` (తెలుగులో `శివపుత్రుడు`) కూడా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ రెండు చిత్రాల తరువాత సూర్య హీరోగా బాలా రూపొందిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ముచ్చటగా మూడోసారి కూడా సూర్య – బాలా కాంబో సక్సెస్ఫుల్ మూవీని అందిస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=RfTNwFP6GeA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























