సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. 2023లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం, విడుదలైన తక్కువ సమయంలోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. కోలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో రూ. 800 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ల మార్క్‌ను దాటిన మొట్టమొదటి తమిళ చిత్రంగా ‘జైలర్ 2’ సరికొత్త చరిత్ర లిఖించింది.
తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ వంటి నాలుగు ప్రధాన దక్షిణాది రాష్ట్రాల్లోనూ విడివిడిగా రూ. 75 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ రేంజ్ రికార్డు సృష్టించిన ఏకైక చిత్రంగా నిలిచింది. రజనీకాంత్ నటన, అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్స్ అతిథి పాత్రలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తలైవా కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























