పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్ ‘ఓ మై గాడ్’ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సింజిత్ ఎర్రమిల్లి స్వరపరిచిన ‘ఓ మై గాడ్’ రొమాంటిక్ సాంగ్. ఆకట్టుకునే ఆర్కెస్ట్రేషన్‌తో పాటు జోష్‌నిచ్చే బీట్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన హీరో మనసులోని భావాలను భాస్కరభట్ల అందంగా అక్షరాల్లోకి తీసుకొచ్చారు. తన సింగిల్ లైఫ్‌ను ప్రేయసి ఎలా మార్చేసిందో, ఆమెతో గడిపే ప్రతి క్షణం తనకు ఎంత విలువైనదో హీరో ఈ పాటలో వ్యక్తం చేస్తాడు. ప్రేమలోని ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఈ పాట చక్కగా ఆవిష్కరిస్తుంది.
రామ్ మిరియాల తనదైన ఎనర్జీ, వాయిస్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. ఆయన డైనమిక్ వోకల్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆట సందీప్ కొరియోగ్రఫీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మౌళి తనూజ్ ప్రశాంత్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకోగా, సుష్మిత శెట్టితో ఆయన కెమిస్ట్రీ క్యూట్‌గా ఉంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌తో సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌తో ఆసక్తిని పెంచిన ‘దొంగ నా కొడుకు’.. ఇప్పుడు ఈ మెలోడీతో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ సినిమాలో అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సింజిత్ ఎర్రమిల్లి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటర్‌గా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
క్యాచీ కంపోజిషన్, ఆకట్టుకునే సాహిత్యం, రామ్ మిరియాల ఎనర్జిటిక్ వోకల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీతో ‘ఓ మై గాడ్’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్‌ను ఆకట్టుకునే ఈ రొమాంటిక్ నంబర్ మ్యూజిక్ లవర్స్‌ను అలరించడంతో పాటు చార్ట్‌బస్టర్‌గా నిలవనుంది. మరో రెండు వారాల్లో సినిమా విడుదల కానుండటంతో ‘దొంగ నా కొడుకు’ ప్రమోషన్స్ మరింత ఊపందుకోనున్నాయి.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో మౌళి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ముందుగా సందీప్ మాస్టర్ గారికి థాంక్స్ చెప్పాలి. నన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చి ఈ సాంగ్ చేయించారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. భాస్కర భట్ల గారు అద్భుతంగా లిరిక్స్ రాశారు. అందరికీ అర్థమయ్యేలా, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా రాశారు. అలాగే రామ్ మిరియాల గారు నా ఫేవరెట్ సింగర్. ఆయన నా సినిమాకు పాట పాడడం అదృష్టంగా భావిస్తున్నాను. సింజిత్ తన మ్యూజిక్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాడు. తను నా ఫ్రెండ్ కావడం చాలా ఆనందంగా ఉంది. నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాను. యూట్యూబ్‌లో స్టార్ట్ చేశాను. తర్వాత లిటిల్ హార్ట్స్తో యాక్టర్‌గా కూడా విజయం వచ్చింది. ఈ సినిమాకు యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేశాను. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి చాలా విషయాలు నేర్చుకున్నాను. కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తే విజయం వస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చాలా కష్టపడి చేశాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. నవంబర్ 13న థియేటర్లలో నవ్వుకోవచ్చు. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























