యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌కి పూర్తిస్థాయి వినోదాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం, అక్టోబర్ 9న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి రోజే సంచలన వసూళ్లను సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹4.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శ్రీవిష్ణు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
థియేటర్లలో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌ను బట్టి దీన్ని “నవ్వుల నవరత్నాలు” అంటూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యూత్ థియేటర్ల వైపు క్యూ కడుతుండటంతో, రాబోయే వీకెండ్ రోజుల్లో (శని, ఆదివారాలు) కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























