మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం #RT78 అధికారికంగా ఖరారైంది. వైవిధ్యమైన కథాంశాలతో అలరించే వివేక్ ఆత్రేయ, మాస్ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రవితేజ కాంబో పడటంతో టాలీవుడ్ వర్గాల్లో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ‘టైటిల్ డాక్యుమెంటరీ’ని అక్టోబర్ 11న ఉదయం 10:30 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
‘సరిపోదా శనివారం’, ‘అంటే సుందరానికి’ వంటి డిఫరెంట్ అప్రోచ్ ఉన్న సినిమాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ, మాస్ మహారాజాని ఎలాంటి సరికొత్త అవతారంలో చూపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 11న రాబోతున్న టైటిల్ డాక్యుమెంటరీతో సినిమా కాన్సెప్ట్‌పై స్పష్టత రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























