మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్యాన్ ఇండియా పౌరాణిక చిత్రంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వస్తున్న కథనాలపై దర్శకుడు త్రివిక్రమ్ స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తిగా పూర్తయ్యాయని, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే ప్రచారంలో ఉన్న ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ నిజా నిజాలపై స్పందిస్తూ.. ఆ టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని, అది కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టం చేశారు.
అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రానికి సంబంధించిన టైటిల్, నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ‘అరవింద సమేత’ తర్వాత వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడం, పైగా పౌరాణిక కథాంశం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























