ది ప్యారడైజ్ సెన్సార్ పూర్తి .. రన్ టైం ఎంతంటే ?

The Paradise Completes Censor Formalities

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యులు ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమాలో ఉన్న తీవ్రమైన రా యాక్షన్ ఎపిసోడ్స్, రఫ్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని సెన్సార్ బోర్డు ఈ సర్టిఫికేషన్‌ను ఇచ్చింది.

ఈ సినిమా మొత్తం రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలు (169 నిమిషాలు) గా లాక్ అయింది. కథను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయి ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా మలిచినట్లు తెలుస్తోంది.

ఏలాంటి అఫీషియల్ ట్రైలర్ విడుదల చేయకుండా నేరుగా థియేటర్లలోకి వస్తుండటం, దానికితోడు ‘A’ సర్టిఫికెట్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.