విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ చిత్రంగా వచ్చిన ‘మహారాజ’ అరుదైన అంతర్జాతీయ ఘనతను సాధించింది. నిథిలన్ సామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్లో రీమేక్ కానున్న తొలి తమిళ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ స్టూడియో ఈ రీమేక్ హక్కులను దక్కించుకున్నట్లు చిత్ర నిర్మాతలు సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి అధికారికంగా ధ్రువీకరించారు. చైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన భారీ విజయం (€91+ కోట్ల కలెక్షన్లు) మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పొందిన ఆదరణే ఈ హాలీవుడ్ రీమేక్‌కు మార్గం సుగమం చేసింది.
ప్రస్తుతం ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్‌ను ఒక స్టార్ హీరోతో భారీ స్థాయిలో సెట్ చేసే పనిలో ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. భారతదేశంలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ తమిళ చిత్రం ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్తుండటంతో చిత్ర బృందానికి, తమిళ సినీ పరిశ్రమకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























