మైత్రి మూవీ మేకర్స్, ధ్రువ్ విక్రమ్ కొత్త సినిమా టైటిల్ జాకీ

Dhruv Vikram’s New Film Titled Jackie

తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌లో ధృవ్ విక్రమ్‌ను ఫుల్ మాస్, లార్జర్ దేన్ లైఫ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. గ్రిట్టీ లైవ్ యాక్షన్ ట్రీట్‌మెంట్‌ను స్టైలిష్ కామిక్ బుక్ తరహా విజువల్‌తో మిక్స్ చేసిన ఈ పోస్టర్.. సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ధృవ్ పాత్ర క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్‌లో, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో ధృవ్ విక్రమ్ కనిపిస్తున్నారు. ఆయన ఫియర్స్ పోజ్ క్యారెక్టర్ కమాండింగ్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. ఇక ముందుకు చాచిన పిడికిలి పోస్టర్‌కు ఫుల్ యాక్షన్ ఫీల్‌ను తీసుకొచ్చింది. “No Retakes Allowed” అనే ట్యాగ్‌లైన్ సినిమా ఎడ్జీ టోన్‌ను మరింత పెంచుతోంది.

ఈ ఫస్ట్ లుక్‌తో ‘జాకీ’ స్టైలిష్, యాక్షన్‌-డ్రివెన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తన మార్క్ చూపిస్తోంది. అదే సమయంలో ధృవ్ విక్రమ్ సరికొత్త పవర్‌ఫుల్ స్క్రీన్ పర్సనాను కూడా పరిచయం చేస్తోంది.

ఈ చిత్రానికి టాప్  టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, వికీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జయసూర్య ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.