మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘కాకా’ నుంచి అదిరిపోయే బర్త్‌డే అప్డేట్ వచ్చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులు, చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘అమ్ములు పాప’ (అనస్వర రాజన్) ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. “ది హార్ట్ ఆఫ్ కాకా” అంటూ వర్ణిస్తూ, ఈ కథలో ఆమె పాత్ర ఎంతో ప్రత్యేకమైనదిగా నిలవబోతోందని టీమ్ పేర్కొంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుపుకుంటోంది. నివేదా థామస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ పునరుద్ఘాటించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























