విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రణబాలి’ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అనురాగ్ పర్వతనేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా అధికారిక టీజర్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ది లెజెండ్ ఆఫ్ ది కర్స్‌డ్ ల్యాండ్ రైజెస్’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో సెప్టెంబర్ 9న ‘రణబాలి’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.ఇక ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యానిక్ బెన్, ఆండీ లాంగ్ ఎన్‌గుయెన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్, రష్మిక మందన్నల కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























