యువ సామ్రాట్ నాగ చైతన్య లాంచ్ చేసిన సుమంత్ మహేంద్రగిరి వారాహి ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్ 

Mahendragiri Varahi Unveils The Rage of Varahi Lyrical Video

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్య ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ సాంగ్ ని లాంచ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజిషన్ పాటకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది. కడలి సత్యనారాయణ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్ గా ఉన్నాయి. నకాష్ అజీజ్ వోకల్స్ ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ఈ పాట కథ, వారాహి అమ్మవారి శక్తి, సినిమాలోని ఇంటెన్స్ వరల్డ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.  ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.