రా & రస్టిక్‌గా మారెమ్మ ట్రైలర్

maremma trailer looks raw rustic

మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న ‘మారెమ్మ’ చిత్రం నుండి అధికారిక ట్రైలర్ విడుదలయ్యి సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గ్రామీణ నేపథ్యం, శక్తివంతమైన మారెమ్మ తల్లి భక్తి భావనలు మరియు ఊరమాస్ రివెంజ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్ర ట్రైలర్‌ను అత్యంత ఇంటెన్స్‌గా తీర్చిదిద్దారు. ఊరిలో వరుసగా జరిగే వింత సంఘటనలు, పవిత్రమైన మారెమ్మ అనే దున్నపోతును కాపాడే హీరో పాత్ర చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజుఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతుండగా, దీపా బాలు కథానాయికగా నటించారు. వికాస్ వాసిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, వి.ఎస్. రూపా లక్ష్మి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించగా, అంకిరెడ్డి ప్రశాంత్ ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వర్తించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.