మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ విన్న తర్వాత, చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మాటలకు అందని రియాక్షన్ ఇది. ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఆ రియాక్షన్లో అర్థమైంది. ‘ఇరుముడి’ సినిమా ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్‌కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ సినిమాలో చిన్న పని చేసిన వారు కూడా ఈ సినిమాకు పనిచేశామని గొప్పగా చెప్పుకునే ఆనందాన్ని ఇచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌కి మేము హ్యాపీగా ఉన్నామని చెప్పే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ‘ఇరుముడి’ సినిమాకు డిస్ట్రిబ్యూషన్స్ నుంచి వస్తున్న కాల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలను ఆడియన్స్ తమ ఇళ్లల్లోకి తీసుకున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ నన్ను గుండెల్లోకి తీసుకున్నారు. ఈ సినిమా విజయం నాకు మరింత బాధ్యతను పెంచింది. రవితేజ గారు సినిమా కోసం ఏం కావాలో అవన్నీ చేశారు. ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రతే ఈ సినిమాలో ఉన్న గొప్పతనం. ఈ సినిమా ప్రయాణంలో శ్రీనివాసరాజు చాలా సపోర్ట్ చేశారు. రవితేజ గారి కుమార్తె కూడా కథ విని చాలా ఎమోషనల్ అయ్యారు. మొన్న సినిమా చూసి కూడా అదే ఎమోషన్‌తో మాట్లాడారు. సాయికుమార్ గారు కథ చెప్పిన తర్వాత నాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా ఓన్ చేసుకుని సినిమా చేశారు.
డీఓపీ విష్ణు, డైరెక్టర్ సాయిసురేష్ నేచురల్ వర్క్ ఇచ్చారు. అనంత శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి చక్కగా లిరిక్స్ రాశారు. నవీన్ గారు, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి చేసిన ‘ఖుషి’ సినిమా చాలా మంచి సక్సెస్ అయింది. కాకపోతే ఆ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని మేము ఊహించుకున్నాం. ఇరుముడి అలాంటి పెద్ద విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్స్. ప్రియా భవాని శంకర్ గారు కావేరి పాత్రని చాలా రియలిస్టిక్‌గా చేశారు. నక్షత్ర చాలా ధైర్యం గల పాప. తను మణెమ్మ పాత్రలో ఎంతలా జీవించిందో ఆడియన్స్ రియాక్షన్స్ చెప్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ కథ వినగానే పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని చెప్పారు. కల్ట్ క్లాసిక్ మూవీ అవుతుందని ట్వీట్ చేస్తానన్నారు. కానీ నేనే వద్దని చెప్పాను. ఆ రోజు ఆయన రాసుకున్న ట్వీట్‌ను ఈరోజు నాకు చూపించారు. మా సినిమా మీద ఆయనకు అంత నమ్మకం ఉంచారు. సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే స్వసికకు టీచర్ పాత్ర చెప్పగానే, ఎలాంటి అనుమానాలు లేకుండా పాత్ర చాలా బాగుందని, ఒక నటిగా నేను నిరూపించుకుంటానని చెప్పి చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఈ సినిమాలో స్టూడెంట్స్‌గా చేసిన మిగతా ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రవితేజగారు నాకు అన్నయ్యతో సమానం అయిన మీడియా కూడా ఈ సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ పెద్ద సక్సెస్ ఇచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























