ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి – రవితేజ

Ravi Teja Gets Emotional Over the Audience Response to Irumudi

బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు. కొమరం, భార్గవ్, కిషోర్ అందరూ సూపర్‌గా చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే రమేష్ ఇంద్ర గారు కూడా బాగా చేశారు. స్టూడెంట్స్‌గా చేసిన అందరూ చక్కగా చేశారు. వాళ్లందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సాయి సురేష్ చాలా నేచురల్‌గా ఆర్ట్ వర్క్ చేశారు. తను చాలా జెన్యూన్ పర్సన్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. అలాగే మా డీఓపీ విష్ణు అమేజింగ్ వర్క్ ఇచ్చాడు. తను చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తాడు. అలాగే దినేష్ సీలేరులో అన్నీ చాలా అద్భుతంగా చూసుకున్నారు. బాబా భాస్కర్, శేఖర్ మాస్టర్, అలాగే మా డైరెక్టర్ శివ ఈ సినిమాకి అద్భుతమైన కొరియోగ్రఫీ చేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ గారు, రియల్ సతీష్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సతీష్‌తో ఇంకా చాలా సినిమాలు చేయాలి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకి సోల్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి వాళ్లు పడుతున్న ఆనందం మాటల్లో చెప్పలేను. వాళ్లతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కోవిడ్ తమిళ్ మలయాళ సినిమాలు ఎక్కువగా చూశాం. అవన్నీ రూటెడ్‌గా ఉండేవి. అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు మన దగ్గర కూడా ఇలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించేది. ‘ఇరుముడి’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా, మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు మళ్లీ ‘ఇరుముడి’ సినిమా చూడడానికి థియేటర్‌కి రావడం కూడా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ ఆనందం మామూలుది కాదు. నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్చేశాను.  డైరెక్టర్ త్రినాథ్ పాత్ర, ‘ఇరుముడి’ అనే టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మా శీను ఈ సినిమా విషయంలో చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మొదటి నుంచి ‘సూపర్‌హిట్ సినిమా సార్’ అని చెబుతూనే ఉండేవాడు. తన నమ్మకం నిజమైంది. ఇంత మంచి సినిమా చేసినందుకు మా డైరెక్టర్ థాంక్యూ. తనది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇంత పెద్ద విజయం వచ్చినా సరే చాలా నార్మల్‌గా ఉంటాడు. ప్రియా భవాని శంకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాలో ఆ ఎమోషన్ పండడానికి తను సెకండ్ హాఫ్‌లో చేసిన ఆ రెండు సీన్స్ ఎంతగానో హెల్ప్ అయ్యాయి. అలాగే బేబీ నక్షత్ర అద్భుతంగా చేసింది. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది.డైరెక్షన్ టీమ్‌కి, ప్రొడక్షన్ టీమ్‌కి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.