ఇది వరుణ్ సక్సెస్ కాదు – చిరంజీవి 

Chiranjeevi’s Speech at the Korean Kanakaraju Success Meet

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 6న జరిగిన ఈ సినిమా ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ విషయాన్ని చూస్తున్నాను. అది మరోసారి ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన తర్వాత ఫంక్షన్ ఎప్పుడు పెడతారు, దాని గురించి నాలుగు మాటలు మాట్లాడాలని ఉంది అని అనుకున్నాను. వరుణ్ ఈ వేడుకకు రమ్మని అన్నప్పుడు కచ్చితంగా వస్తానని చెప్పాను. ఇలాంటి విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు తలవంచి ధన్యవాదాలు తెలియజేయడం మనందరి బాధ్యత. ఒక సినిమా విజయం సాధిస్తే నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా ఎంతోమందిలో సంతోషం నింపుతుంది. ప్రతి ఒక్కరూ గుండెల నిండా ఆనందంతో ‘కొరియన్ కనకరాజు’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం దర్శకుడు మేర్లపాక గాంధీ. జనాలకు నచ్చే అద్భుతమైన కంటెంట్‌ను అందించారు. ఒక సినిమా విజయంలో దర్శకుడి బాధ్యత ఎంతో ఉంటుంది. గాంధీ అద్భుతమైన దర్శకుడు. తను ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. హారర్ కామెడీ సినిమాలు ఇదివరకు చాలా వచ్చాయి. కానీ ‘కొరియన్ కనకరాజు’లో కొరియన్ ఫ్లేవర్‌ను, ఆ కల్చర్‌ను తీసుకురావడం చాలా గొప్ప ఆలోచన. ఈ విజయంలో ఆ ఆలోచన ప్రధాన కారణం. అందుకు దర్శకుడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా ఇంత కమర్షియల్‌గా అందరినీ అలరించిందంటే దానికి మరో ప్రధాన కారణం నా బిడ్డ వరుణ్ తేజ్. వరుణ్ మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలు, కథలు, పాత్రలు చేస్తున్నాడు. ‘ముకుంద’, ‘కంచె’, ‘అంతరిక్షం’ ఇలా ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తున్నాడు. ఆర్టిస్ట్‌గా నిలబడాలనే తపన అతనిలో ఉంది. నటుడిగా ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇదే నమ్మకంతో ముందుకు వెళ్తే ఒక విలక్షణమైన నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు.

వరుణ్‌కి పర్సనల్‌గా ఒక మాట చెప్పాలి. ఇది వరుణ్ సక్సెస్ కాదు.. మా బుడ్డోడు వాయుతేజ్ సక్సెస్. ఈ సక్సెస్‌ను వాయు ఖాతాలో వేయాలి( నవ్వుతూ). తను మా లక్కీ చార్మ్. సినిమా విజయానికి మరొక బలమైన కారణం సత్య. ఈ వేడుకకు రావాలని తను చాలా ఉత్సాహపడ్డాడు. కానీ షూటింగ్ వల్ల రాలేకపోయాడు. సినిమాలో సత్య చాలా అద్భుతంగా చేశాడు. తన కోసం ఈ సినిమాను మరోసారి చూడాలని అనిపించేంత గొప్పగా చేశాడు. రితిక కూడా అద్భుతంగా నటించింది. అలాగే మురళీధర్ గౌడ్ గారు కూడా చాలా చక్కగా నటించారు. ఈ సినిమాను దర్శకుడు అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయగలిగాడు. అదే ఈ సినిమా తొలి సక్సెస్. ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం. 2026 సెకండ్ హాఫ్ ‘పెద్ది’ సినిమా హిట్‌తో మొదలైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం’, ‘లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’.. ఇలా వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి సినిమా ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు అనే విషయాన్ని ఈ సినిమాలు నిరూపించాయి. ఈ సినిమాకు పనిచేసిన ఇతర నటీనటులు, టెక్నీషియన్లందరికీ అభినందనలు. నా హృదయానికి దగ్గరైన మంచి మనిషి తమన్‌. తనలో చాలా ఎనర్జీ ఉంటుంది. తను ఈ సినిమాకు తన మ్యూజిక్‌తో ప్రాణ ప్రతిష్ఠ చేశాడు.

తమన్‌తో నేను కలిసి చేస్తున్న నా సినిమా టీజర్ నా బర్త్‌డేకు రాబోతోంది. దానికి సంబంధించిన బీజీఎం మరో లెవెల్‌లో ఉంటుంది. ఆ టీజర్ మీకు నచ్చితే అదే మీరు నాకు ఇచ్చే బర్త్‌డే విషెస్. నిర్మాత రాజీవ్ రెడ్డి గారికి, వారి స్నేహితుడు క్రిష్ గారికి, వంశీ, విక్రమ్‌లకు అభినందనలు. సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.