‘అల్లరి’ నరేష్, సురభి జంటగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మాణంలో, చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ & హాస్య మూవీస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫీషియల్ టీజర్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోకి చిన్నతనంలో ఒక విచిత్రమైన పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకంపై సరైన ముగ్గు వేసి పూజలు చేస్తే స్వర్గం నుంచి రంభ, ఊర్వశి, మేనకలు భూమిపైకి వచ్చి కోరిన కోరికలు తీరుస్తారని గ్రహిస్తాడు.అల్లరి నరేష్ వినోదాత్మక పంచులతో పాటు వెన్నెల కిషోర్ భిన్నమైన ఇంద్రుడి పాత్ర టీజర్‌లో నవ్వులు పూయించింది.
ఏకంగా 25 ఏళ్ల పాటు మాల ధరించి, నిష్టగా పూజలు చేస్తూ చివరికి దేవకన్యలను భూమి మీదికి రప్పిస్తాడు.వారు వచ్చాక హీరో జీవితంలో ఎలాంటి వినోదాత్మక గందరగోళం ఎదురైంది అనేదే ఈ చిత్ర కథాంశం.
రంభగా: రాశి సింగ్ , ఊర్వశిగా: విష్ణుప్రియ , మేనకగా: ప్రిషా సింగ్ , ఇంద్రుడిగా: వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























