‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్-ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర బిగ్ ట్రైలర్‌ను ఆగస్టు 8న బెంగళూరులో జరగబోయే గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు.
ఈసినిమాలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషీ మరియు రుక్మిణి వసంత్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు యష్ స్వంత బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ కలసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.ట్రైలర్ కట్ కూడా నెక్స్ట్ లెవల్ గా ఉంటే టాక్సిక్ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























