శ్రీనివాస మంగాపురం సెన్సార్ పూర్తి.. జూలై 30న గ్రాండ్ రిలీజ్

Srinivasa Mangapuram Clears Censor Set for a Grand Release on July 30

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న ఇంటెన్స్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. జయకృష్ణ సరసన బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో పవర్‌ఫుల్ అండ్ రస్టిక్ నెగటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు.

తిరుపతి పరిసరాల్లోని ‘శ్రీనివాస మంగాపురం’ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ ఇది. జి. వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. ఉదయ్ కిరణ్, జెమిని కిరణ్ నిర్మించగా, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్విని దత్ సమర్పిస్తున్నారు.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 30న థియేటర్లలోకి రానుంది. టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఘట్టమనేని అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.