అల్లరి నరేష్ హీరోగా, చంద్ర మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో-ఫాంటసీ కామిక్ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ ప్రమోషన్లు వేగం పుంజుకున్నాయి. ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట ‘నా కంటి మీద కునుకే’ ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేమికుల మనసులను దోచుకునే అందమైన లవ్ మెలోడీగా రూపొందిన ఈ పాటకి సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అద్భుతమైన స్వరాలను అందించారు. ప్రముఖ సినీ రచయిత భాస్కరభట్ల రాసిన క్లాసిక్ సాహిత్యానికి, గాయకుడు ధనంజయ్ తన మధురమైన గాత్రంతో ప్రాణం పోశారు.
హాస్య మూవీస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా, బి.ఎల్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటే శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ రొమాంటిక్ ట్రాక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























