మలయాళ స్టార్ హీరో, టాలీవుడ్ ఆడియన్స్‌కు ఎంతగానో నచ్చిన దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎట్టకేలకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ’ అనే క్లాసిక్ అండ్ పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇదొక ప్యూర్,రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతోందని స్పష్టమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 10వ చిత్రమిది. దర్శకుడు రవి నెలకుడితి ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి మరో కీలక పాత్రలో మెరవనున్నారు.
ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తుండటం విశేషం. లవ్ స్టోరీలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చే మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండగా అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
‘సీతా రామం’ తర్వాత దుల్కర్ సల్మాన్ చేస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ కావడం, పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండటంతో ‘శ్రీ శ్రీ’ చిత్రంపై అప్పుడే ట్రేడ్ వర్గాల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























