కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

వదలా సినిమా అద్భుతంగా వచ్చింది - హీరో జగపతి బాబు

Jagapathi Babu says Vadhala movie Came Out Fantastic

వదలా సినిమా అద్భుతంగా వచ్చింది - హీరో జగపతి బాబు

Jagapathi Babu says Vadhala movie Came Out Fantastic

Jagapathi Babu says Vadhala movie Came Out Fantastic

వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు.

గ్లింప్స్ ప్రారంభంలో జగపతిబాబు కలవరపరిచే ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపించారు. ఆ తర్వాత లయ ఎంట్రీ ఇస్తుంది. ఆమె ముఖంలో కనిపించే ఆందోళన, టెన్షన్ కథలోని పరిస్థితులను సూచిస్తుంది.

కథ ఒక్కసారిగా మరింత డార్క్ టోన్‌లోకి మారుతుంది. ఒక మహిళా వాయిస్ ఓవర్ వినిపిస్తూ ''నీ ఫ్యామిలీలో ఒకరిని తీసేసుకుంటా' అని చెప్పడం షాకింగ్ అల్టిమేటమ్‌ను రివిల్ చేస్తుంది. ఇది వెంటనే ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది.

షార్ఫ్ కట్స్‌తో యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్ “రేస్ అగైనెస్ట్ టైమ్” అనిపించే టెన్షన్ ని సృష్టిస్తాయి. దర్శకుడు ఆకెళ్ళ వి కృష్ణ సస్పెన్స్‌ను హ్యాండిల్ చేసిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది.

జగపతి బాబు కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న పాత్రలో కనిపించారు. మరోవైపు లయ కూడా ఇంటెన్స్ వున్న పాత్రలో కనిపిస్తూ కథకు బలాన్ని ఇస్తుంది.

సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు అందించిన డైనమిక్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక టోన్ సెట్ చేతోంది. సంగీత దర్శకుడు కార్తిక్ అందించిన పల్సేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వదలా థీమ్ థ్రిల్‌ను మరింత పెంచుతుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు చేసిన క్రిస్ప్ ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది.

చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల రచన అందించగా, ఆర్ట్ డైరెక్షన్‌ను బజ్జా బ్రహ్మయ్య నిర్వహించారు. మొత్తంగా ఈ ఇంట్రిగింగ్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతూ, టెన్షన్, భావోద్వేగం, థ్రిల్ కలిసిన హై-ఇంపాక్ట్ థ్రిల్లర్‌ను ప్రామిస్ చేస్తోంది.

గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో హీరో జగపతిబాబు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం.. వదలా సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడం మీడియా బాధ్యత. తీసుకెళ్లకపోతే మిమ్మల్ని వదలా.. ఆడియన్స్ రాకపోతే వాళ్లని వదలా.. బాగుంది అనేవరకు వదలా ఇది ఆడియన్స్ కి మీకు మాకు.. మన ముగ్గురికి సంబంధించిన మేనియా( నవ్వుతూ) కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో ఒక సినిమా చేద్దామని ఆయన ఫీల్ అవ్వడంతో ఈ సినిమా మొదలైంది. భరద్వాజ గారు ముక్కుసూటిగా ఉంటారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం చోటా కె నాయుడు. తన ఎనర్జీ అందరికీ పంచాడు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఈ సినిమా చేయమని నేనే రిక్వెస్ట్ చేశాను. మరో ఆలోచన లేకుండా సినిమా చేశారు. అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమా భోపాల్ లో చేశాం. అక్కడి ప్రభుత్వానికి ధన్యవాదాలు. భరద్వాజ గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ 24 గంటలు పనిచేస్తున్నారు.ఆయన్ని అభినందించాలి.

ఆయన ఆలోచనలు చాలా మోడరన్ గా ఉన్నాయి. అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా పనిచేస్తున్న అందరూ నటీనటులు టెక్నీషియన్స్ చాలా సపోర్ట్ చేశారు. కార్తిక్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. తన నుంచే వదలా అనే టైటిల్ కూడా వచ్చింది. లయ నా డియర్ ఫ్రెండ్. మనోహరం సినిమా చేసినప్పుడు తను చాలా చిన్న పిల్ల. తర్వాత హనుమాన్ జంక్షన్ చేశాం. వదలాలో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఉంది.ఆముద పాత్రలో హ్రితిక కూడా చాలా టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఆడియన్స్ అందరు కూడా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. సునీల్ నారంగ్ గారు వున్నారు కాబట్టి చాలా మంచి రిలీజ్ ఉంటుంది. కచ్చితంగా మంచి హిట్ కొట్టగలమనే నమ్మకం ఉంది. అందరికీ థాంక్యు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్