నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, ఇప్పుడు తన సరికొత్త ప్రతిష్టాత్మక చిత్రం ‘మైసా’ కోసం ఒక భారీ సాహసం చేసి వార్తల్లో నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ హై-ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీలో రష్మిక ఇప్పటివరకు చేయని ఒక అత్యంత ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ పంచుకున్నారు. కథలో అత్యంత కీలకమైన ఒక అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను (నీటి అడుగున చేసే ఫైట్ సీన్) రష్మిక డూప్ లేకుండా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రిస్కీ సన్నివేశం కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. నీటిలో చిత్రీకరించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ విజువల్స్ అద్భుతంగా వచ్చాయని, ఇది సినిమా మొత్తానికే ఒక మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ప్రస్తుతం ‘మైసా’ ఆరో ప్రధాన షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు.అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ పాన్-ఇండియా చిత్రం యొక్క విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.అతి త్వరలోనే టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























