జైలర్ 2 విడుదల తేదీ ఖరారు

Jailer 2 Gets an Official Release Date

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు సంచలన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ అధికారిక విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ భారీ పాన్-ఇండియా చిత్రం వచ్చే ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం తర్వాత, ఇప్పుడు ఈ పార్ట్ 2 అనౌన్స్‌మెంట్‌తోనే ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సాంకేతిక నిపుణులుగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన టాప్ క్లాస్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా విజువల్స్ అందిస్తున్నారు. అలాగే ఆర్. నిర్మల్ ఎడిటర్‌గా, చేతన్ డిసౌజా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా మరియు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిరణ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పల్లవి సింగ్, కబిలన్ చెల్లయ్య కాస్ట్యూమ్ డిజైనర్స్‌గా వర్క్ చేస్తున్నారు.

ఫస్ట్ పార్ట్ కంటే ఈ సీక్వెల్ లో ‘ముత్తువేల్ పాండియన్’గా రజనీకాంత్‌ను వెండితెరపై నెక్స్ట్ లెవెల్ మాస్ అవతారంలో చూపించనున్నాడు నెల్సన్. ఈ చిత్రంపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచానాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.