రామ్ 23కి స్టార్ కంపోజర్ సామ్ సిఎస్ మ్యూజిక్

Star Composer Sam C.S. to Score Music for RAPO 23

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న చిత్రం ఇది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఖైదీ, పుష్ప 2, మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలకు అదిరిపోయే సౌండ్ ట్రాక్స్ అందించిన సామ్ సిఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. #RAPO23లో సామ్ సిఎస్ చేరడంతో మ్యూజికల్ కూడా ఈ చిత్రం భారీ అంచనాలని నెలకొల్పింది. #RAPO23లో మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోంది.

దర్శకత్వం, కథతో పాటు కథానాయకుడిగానూ నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను పోషించబోతున్నారు.ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.