భారత క్రికెట్ చరిత్రలో అగ్రెసివ్ కెప్టెన్సీకి సరికొత్త నిర్వచనం ఇచ్చి, టీమిండియా దశ-దిశను మార్చిన ‘బెంగాల్ టైగర్’ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే క్రేజీ అప్‌డేట్ లభించింది. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ ‘దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ వెర్సటైల్ స్టార్ రాజ్ కుమార్ రావ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. గంగూలీ పుట్టినరోజు నాడే ఈ ఫస్ట్ లుక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ మరియు సినీ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ క్రికెట్ లవర్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ తన జెర్సీని గాల్లోకి ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్న ఐకానిక్ మూమెంట్‌ను ఈ పోస్టర్‌లో చూపించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసిన విధానం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది. భారత క్రికెట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన దాదా ప్రయాణాన్ని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























