టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’ చిత్రం థర్డ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ‘ప్రేమ ప్రేమిస్తున్నా’ లిరికల్ వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ప్రేమలోని స్వచ్ఛమైన అనుభూతిని, మనసుకు హత్తుకునే అద్భుతమైన సాహిత్యంతో ఆవిష్కరించేలా సాగే ఈ మెలోడీ సాంగ్ తెలుగు సంగీత ప్రియులను మొదటి వినికిడిలోనే విశేషంగా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జులై 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న తరుణంలో, ఈ ప్యూర్ తెలుగు లవ్ సాంగ్‌తో చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్‌ను మరింత పెంచేసింది.భరత్ మంచీరాజు అత్యంత హృద్యమైన బాణీలతో స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్, సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే ఇంటెన్స్ అండ్ బ్యూటిఫుల్ లవ్ ట్రాక్‌ను ప్రతిబింబిస్తోంది.
మహేశ్వర మూలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్. కుషేందర్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, గవిరెడ్డి శ్రీనివాస్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























