సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు సంచలన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ అధికారిక విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం, ఈ భారీ పాన్-ఇండియా చిత్రం వచ్చే ఏడాది అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం తర్వాత, ఇప్పుడు ఈ పార్ట్ 2 అనౌన్స్మెంట్తోనే ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సాంకేతిక నిపుణులుగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన టాప్ క్లాస్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా విజువల్స్ అందిస్తున్నారు. అలాగే ఆర్. నిర్మల్ ఎడిటర్‌గా, చేతన్ డిసౌజా యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా మరియు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కిరణ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పల్లవి సింగ్, కబిలన్ చెల్లయ్య కాస్ట్యూమ్ డిజైనర్స్గా వర్క్ చేస్తున్నారు.
ఫస్ట్ పార్ట్ కంటే ఈ సీక్వెల్ లో ‘ముత్తువేల్ పాండియన్’గా రజనీకాంత్‌ను వెండితెరపై నెక్స్ట్ లెవెల్ మాస్ అవతారంలో చూపించనున్నాడు నెల్సన్. ఈ చిత్రంపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచానాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























