హోంబాలే ఫిలింస్ నిర్మాణంలో నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య, డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ #Suriya48 అప్పుడే స్పీడ్ పెంచేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలై 22, 2026 నుండి ప్రారంభించేందుకు చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. ఇది హోంబాలే బ్యానర్ లో వచ్చే ఇతర భారీ సినిమాల్లా ఏళ్ల తరబడి సాగకుండా, చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. ఒక పక్కా బ్లూప్రింట్‌తో చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. అనుకున్నట్లుగా షెడ్యూల్స్ ముగించి, సినిమాను మే 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ‘జై భీమ్’ కాంబోలో రాబోతున్న ఈ ఇంటెన్స్ డ్రామాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక సూర్య ప్రస్తుతం తన 47వ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు.జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. నజ్రియా ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా యువ మలయాళ నటుడు నస్లీన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























