సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు సెకండ్ సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశాల్ మాట్లాడుతూ .. ‘‘మకుటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. ‘శివ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. ఈరోజు ఆర్‌బీ చౌదరి గారిని నేను మిస్ అవుతున్నాను. 99వ ప్రాజెక్ట్ బాధ్యతల్ని ఆయన నాకు ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీకి దర్శకుడిగా మారాను. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను. ఆయన బ్యానర్ నుంచి పరిచయం అయిన దర్శకుల్లో నేను 45వ వ్యక్తిని. సుబ్రహ్మణ్యం గారు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ‘మకుటం’ ఈ స్థాయి వరకు వచ్చింది. ఈ మూవీ కోసమే ఏడాదిపాటుగా నా పర్సనల్ విషయాల్ని పక్కన పెట్టాను. నాకు ఈ ప్రయాణంలో సాయి ధన్సిక ఎంతో అండగా నిలిచారు. ‘లింగా’ పాట మంచి హిట్ అయింది. అందులో నన్ను సింగర్‌గా చేయడం జీవీ ప్రకాష్ తీసుకున్న రిస్క్ (నవ్వుతూ). ‘నచ్చాకే వచ్చేరా’ పాటను ప్రభ అద్భుతంగా పాడింది. ఆమె పాడిన ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. నన్ను నమ్మి ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన తోటి ఆర్టిస్టులందరికీ థాంక్స్.
నేను ఇంత వరకు పని చేసిన దర్శకులందరి టెక్నిక్స్‌ను ఇందులో వాడాను. ఈ సినిమా కోసం నా బెస్ట్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. మూవీ గురించి నేను ఎక్కువగా చెప్పను. ఈ చిత్రాన్ని చూసిన తరువాత ఆడియెన్స్ మాట్లాడతారు. మా నాన్న జీకే రెడ్డి గారి వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. ‘పందెంకోడి’ మూవీని ఆయనే పట్టుబట్టి తెలుగులో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దర్శకుడిగా మీ ముందుకు రాబోతోన్నాను. నన్ను ప్రభావితం చేసిన అర్జున్ గారికి, ఆర్జీవీ గారికి థాంక్స్. గత 22 ఏళ్లలో 35 చిత్రాలు చేశాను. ఇంత వరకు నన్ను అభిమానించిన, ఆదరించిన ప్రేక్షకదేవుళ్లకు థాంక్స్. ‘మకుటం’ ఎలా ఉంది అనేది నేనే ఆడియెన్స్ వద్దకు వచ్చి తెలుసుకుంటాను. ‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు. ఓ మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాను’ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























