అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ రూరల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘లెనిన్’ . మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘సోల్ ఆఫ్ లెనిన్’ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ.. రేపు (జూన్ 30న) ఈ చిత్ర ట్రైలర్‌ను వైజాగ్ లో విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో అఖిల్ మునుపెన్నడూ చూడని రగ్గడ్ అండ్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో రేపు రాబోయే ట్రైలర్ సినిమా బిజినెస్‌కు, హైప్‌కు చాలా కీలకం కానుంది.
ఇక ఈసినిమాతో అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.నాగార్జున అయితే సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా వున్నారు.మరి ఈసినిమానైనా అఖిల్ కు కావాల్సిన విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























