సూపర్ హీరో తేజ సజ్జా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను కూడా మీతో పాటు ఇప్పుడే మొదటిసారి ఈ 3D ట్రైలర్‌ను చూశాను. నిరంజన్ గారు, చైతన్య గారు ఎంతో కష్టపడి దీనిని సిద్ధం చేశారు. ఇప్పటివరకు వారు పడిన శ్రమ ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది. 3D చాలా అద్భుతంగా వచ్చింది. ఇది అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను. నేనూ మీలాగే మళ్లీ థియేటర్లలో ఈ సినిమాను 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ టీమ్‌ను మళ్లీ కలవడం ఒక రీయూనియన్‌లా అనిపించింది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం. సాయి దుర్గ తేజ్ గారు, నిరంజన్ గారి కాంబినేషన్లో వస్తున్న సంబరాల ఏటిగట్టు చిత్రానికి ఆల్ ది బెస్ట్. ఆ సినిమాపై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. జూన్ 25న హనుమాన్ 3D విడుదలవుతోంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి.”
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























