పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! ‘దే ఆర్ కాలింగ్ హిమ్ ఓజీ’ అంటూ గతేడాది థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన ‘OG’ చిత్రానికి సీక్వెల్/ప్రిక్వెల్ రూపంలో ఓజీ యూనివర్స్ పనులు అధికారికంగా షురూ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గతంలో పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేసినట్లుగానే, ఇప్పుడు లైనప్ లాక్ అయింది. పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓజీ’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఓజాస్ గంభీర అరాచకానికి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అయితే ఆ సినిమా ముగింపులోనే సుజీత్ దీనికి పార్ట్-2 ఉంటుందని హింట్ ఇచ్చారు. తాజాగా ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సోషల్ మీడియా వేదికగా ఒక అఫీషియల్ ఫోటోను షేర్ చేస్తూ మేజర్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.
“పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసినట్లుగానే.. క్రియేటివ్ వర్క్స్ ఆఫీస్‌లో దర్శకుడు సుజీత్ తో కలిసి ‘OG యూనివర్స్’ చర్చలు ప్రారంభమయ్యాయి” అంటూ ప్రకటించారు. దాంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.ఓజీకి సెన్సేషనల్ మ్యూజిక్ అందించిన తమన్ ఓజీ 2కి కూడా సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్ తో పవన్ కళ్యాణ్ ఈసినిమాను తన బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో నిర్మించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























