శ్రీనివాస మంగాపురం నుండి గుండె పేలిపోతోందే సాంగ్ రిలీజ్

Third Single from Srinivasa Mangapuram Released

‘మంగళవారం’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమవుతుండగా, బాలీవుడ్ యువ నటి రాషా తడానీ ‘ఉయ్ అమ్మ’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. నిర్మాత పీ. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం మూడో సింగిల్ ‘గుండె పేలిపోతోందే’ పాటను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలి ప్రేమలో కలిగే మధురమైన భావోద్వేగాలను ఆవిష్కరించే ఈ పాట, ఓ యువకుడు తొలిచూపులోనే ఓ అమ్మాయిపై ప్రేమలో పడిన తర్వాత అతని మనసులో కలిగే ఉత్సాహం, ఆశ్చర్యం, ఆనందాన్ని అందంగా చూపిస్తుంది. ఆమె చుట్టూనే తిరగాలని, ఆమె ఉన్న చోటే ఉండాలని కోరుకునే ప్రేమికుడి మనసుని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ పాటకు క్లాసిక్, మోడరన్ మెలోడీతో మేళవిస్తూ అద్భుతంగా కంపోజ్ చేశారు. సాఫ్ట్ ఫ్లూట్ బిట్స్, అందమైన వయోలిన్ స్వరాలు, ఆర్కెస్ట్రేషన్ ఈ పాటను సంగీత ప్రియులకు ప్రత్యేక అనుభూతిగామార్చాయి. ఆస్కార్ విజేత గేయరచయిత చంద్రబోస్ రాసిన సాహిత్యం తొలి ప్రేమ అమాయకత్వాన్ని అద్భుతంగా పలికించగా, అనురాగ్ కులకర్ణి తన హార్ట్ టచ్చింగ్ వోకల్స్ తో పాటకు మరింత ప్రాణం పోశారు.

ఆలయ నేపథ్యంతో చిత్రీకరించిన ఈ పాట విజువల్‌గా కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. కలర్ ఫుల్ ఫ్రేమ్స్, అందమైన లొకేషన్స్, ఆకర్షణీయమైన విజువల్స్ పాటకు మరింత అందాన్ని చేకూర్చాయి. భాను మాస్టర్ కొరియోగ్రఫీ ప్రేమలో మునిగిపోయిన యువకుడి భావోద్వేగాలను చక్కగా ప్రజెంట్ చేసింది.

హీరో జయకృష్ణ ఘట్టమనేని తన నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, రాషా తడానీ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించింది. వీరిద్దరి మధ్య కనిపించిన ఫ్రెష్ కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మధురమైన స్వరాలు, ఆకట్టుకునే సాహిత్యం, అందమైన విజువల్స్, మనసుకు హత్తుకునే ప్రేమ భావాలతో ‘గుండె పేలిపోతోందే’ పాట ఇప్పటికే సంగీత ప్రేమికులను ఆకట్టుకుంటూ రొమాంటిక్ ప్లేలిస్టుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

ప్రేమకథలను కొత్తదనంతో, భావోద్వేగాలతో చెప్పడంలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించిన అజయ్ భూపతి, ఈ చిత్రాన్ని కూడా బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో రూపొందిస్తున్నట్లు ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ స్పష్టం చేస్తోంది.

ఈ చిత్రానికి జయకృష్ణ ISC సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, మాధవ్ కుమార్ గుల్లపాటి ఎడిటింగ్, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, రియల్ సతీష్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.శ్రీనివాస మంగాపురం జూలై 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.