బాక్సాఫీస్ వద్ద సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ‘బ్లాస్ట్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్పీడ్‌తో దూసుకెళ్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 25.26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలనే సైతం ఆశ్చర్యపరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం రోజున సినిమాల కలెక్షన్లు తగ్గుతుంటాయి. కానీ ‘బ్లాస్ట్’ చిత్రానికి మాత్రం సీన్ రివర్స్ అయింది. సోమవారం టెస్టును ఈ సినిమా చాలా ఈజీగా పాస్ అవ్వడమే కాకుండా.. ఏకంగా 32% జంప్‌తో ఇండియాలో రూ. 6 కోట్ల నెట్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.
తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన కేంద్రాలలో థియేటర్లన్నీ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.అటు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా బ్లాస్ట్ జోన్ గా విడుదలై 2 కోట్ల వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరించింది.
కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ‘బ్లాస్ట్’ హవా నడుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం ఇప్పటివరకు రూ.6 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.
ఈ సినిమాలో హీరో అర్జున్, ప్రీతి ముకుందన్ , పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ యాక్షన్ ఎలిమెంట్స్‌కు ఫిదా అయిపోతున్నారు.
సినిమాకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ మరియు మౌత్ టాక్ చూస్తుంటే.. లాంగ్ రన్లో ఈసినిమా 50కోట్ల,వరకు వసూళ్లను రాబట్టుకోనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ కేవలం 15కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. ఫుల్ రన్ లో ఈసినిమా నిర్మాతలకు భారీ లాభాలను తీసుకురానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























