మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం చెన్నైలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చెన్నై ప్రెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. చెన్నై మీడియాకు నమస్కారం. ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల ప్రమోషన్స్ కోసం చెన్నైకి వచ్చాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ‘పెద్ది’ కోసం మేమంతా రెండున్నరేళ్లు కష్టపడ్డాం. నేను 285 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు శ్రమించారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ సెంటర్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ గారు. ఆయనలాంటి లెజెండ్‌తో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. శివన్న గారిని స్క్రీన్‌పై చూస్తే ఓ ఫైర్‌లా అనిపిస్తుంది. ‘జైలర్’లో ఆయన సీన్స్ చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఒక ఐకానిక్ పెర్ఫార్మెన్స్. ఆయన కళ్లే ఎన్నో ఎమోషన్స్ మాట్లాడతాయి.
రత్నవేలు గారితో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయన ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన బిగ్గెస్ట్ అసెట్. దివ్యేందు రియల్ లైఫ్‌లో కూడా గ్యాంగ్‌స్టర్‌లా యాక్ట్ చేస్తుంటారు. దివ్యేందు, నేను ఒకే ఎత్తు ఉన్నా, సినిమాలో మా బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ మాత్రం ఆరున్నర అడుగుల పైనే ఉంటాయి. జాన్వీ గారు ఈ సినిమాకు ఎంతో అందాన్ని తీసుకొచ్చారు. మా నిర్మాత సతీష్ కిలారు గారికి ధన్యవాదాలు. ఇది కష్టంతో చేసిన సినిమా కాదు, ఇష్టంతో చేసిన సినిమా. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు చేస్తున్నప్పుడే అవి పెద్ద విజయాలు సాధిస్తాయని అనిపించింది. ‘పెద్ది’ విషయంలో కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఇది చాలా స్ఫూర్తినిచ్చే సినిమా. నా కెరీర్‌లో జీవితాంతం దాచుకునే సినిమాల్లో ఇది ఒకటి. బుచ్చిబాబుకి, సుకుమార్ గారికి థాంక్యూ సో మచ్. ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది. ఇదొక బ్యూటీఫుల్ ఎంటర్‌టైనర్. ఇందులో ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం విజయ్ గారికి, తమిళనాడు ప్రజలకు నా శుభాకాంక్షలు తెలిజేస్తున్నాను. విజయ్ గారిని చూసి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. పెద్ది చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























