
‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన రీల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ జంట నాగ చైతన్య, సమంత పెళ్లి తరువాత మరోసారి మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చైతు రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు టీజర్ చూస్తే ఇప్పటికే అర్ధమైపోయింది.ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. ప్రియతమా..ప్రియతమా అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
కాగా ఈ సినిమాలో దివ్యంశ కౌశిక్ అనే హిందీ నటి కూడా మరోక కీలక పాత్రలో నటిస్తుంది. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5 న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి రీల్ లైఫ్ లో మొదటి సారిగా వీరిద్దరూ భార్య భర్తలుగా నటిస్తున్నారు… అది కూడా గొడవపడే భార్యభర్తల్లాగ.. చూద్దాం మరి ఏ రేంజ్ లో గొడవపడతారో..?
[youtube_video videoid=7TgSCEQYUpI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























