కోలీవుడ్ వర్సటైల్ స్టార్ హీరో సూర్య ,టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ . ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు జూలై రిలీజ్ అనుకున్న ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం అధికారికంగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్టు 15 సెలవు దినం గురువారం వస్తుండటంతో,ఆగస్టు 14న సినిమాను విడుదల చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద లాంగ్ వీకెండ్ వసూళ్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కథ కావడంతో హాలిడేస్ ఈ చిత్రానికి భారీగా ప్లస్ అవ్వనున్నాయి.
‘ప్రేమలు’ ఫేమ్ లక్కీ బ్యూటీ మమితా బైజు ఇందులో 20 ఏళ్ల యువతిగా నటిస్తోంది. తన కంటే వయసులో చాలా పెద్దవాడైన సూర్యను ఆమె ప్రేమించడం, వారి మధ్య వచ్చే సున్నితమైన భావోద్వేగాలను దర్శకుడు చాలా అందంగా మలిచారు.
సీనియర్ నటీమణులు రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌసెస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























