కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సినిమాలకు తెలుగులో ఉండే క్రేజ్, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటించిన ప్రతి తమిళ సినిమా ఇక్కడ డబ్బింగ్ రూపంలో విడుదలై భారీ వసూళ్లు సాధిస్తుంటుంది. అయితే, కార్తీ నేరుగా ఒక ‘స్ట్రైట్ తెలుగు సినిమా’ చేసి చాలా ఏళ్లు అవుతోంది. 2016లో నాగార్జునతో కలిసి చేసిన బైలింగ్వల్ మూవీ ‘ఊపిరి తర్వాత ఆయన మళ్లీ పూర్తిస్థాయి తెలుగు సినిమా చేయలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కార్తీ ఒక పక్కా స్ట్రైట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద హిలేరియస్ నవ్వుల జాతర సృష్టించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్దర్శకత్వంలో కార్తీ తన 30 వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.
ఈరోజు కార్తీ బర్త్‌డే కానుకగా లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పూజా కార్యక్రమాల ఫొటోలను షేర్ చేసింది.
ఇక ఈ సినిమాలో కార్తీ సరసన టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.కార్తీ, మీనాక్షి కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే . ప్రముఖ కమెడియన్ యోగి బాబు కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























