పెద్ది నుంచి మాస్ సాంగ్ హల్లల్లల్లో రిలీజ్

Mass Song Hellallallo from Peddi Released

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ఇటీవల విడుదలైన పవర్‌ఫుల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. రగ్డ్ యాక్షన్, బలమైన ఎమోషన్స్, భారీ కాన్వాస్‌తో రూపొందిన గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలవగా, తాజాగా మూడో సింగిల్ ‘హల్లల్లల్లో’ కూడా అదే జోరును కొనసాగిస్తోంది. భోపాల్‌లో నిర్వహించిన భారీ ‘పెద్ది కీ ఆవాజ్’ ఈవెంట్‌లో ఈ పాటను లాంచ్ చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. అనంతరం డిజిటల్‌గా విడుదలైన ఈ పాట అంచనాలకు మించి ఆదరణ దక్కించుకుంటోంది.

భారీ బీట్స్, డ్రమ్స్, జానపద శైలిలో సాగే రిథమ్‌తో ఏఆర్ రెహమాన్ ఈ పాటను మాస్ యాంథమ్‌లా తీర్చిదిద్దారు. మొదటి క్షణం నుంచే ఆకట్టుకునే ఈ ట్యూన్ ఆఖరి వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంది. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పాటకు మరింత మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చింది. జానపదంతో కూడిన పదాలు పాటకు ప్రత్యేకమైన నేటివిటీని అందించాయి. రక్షితా సురేష్ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆమె వాయిస్ లోని ఎనర్జీ, రెహమాన్ బీట్స్‌తో కలిసి వినసొంపైన సంగీతానుభూతిని అందిస్తోంది.

విజువల్‌గా‘హల్లల్లల్లో’ ఒక గ్రాండ్ స్పెక్టకిల్‌లా కనిపిస్తోంది. భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ ముగ్గురూ అదిరిపోయే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో  ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు, శృతి హాసన్ తన గ్లామర్, గ్రేస్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాన్వీ కపూర్ కూడా తన ఎలిగెన్స్, ఎనర్జీతో పాటకు మరింత కలర్ యాడ్ చశారు. ముగ్గురి కాంబినేషన్ ఈ పాటను ఓ విజువల్ ట్రీట్‌గా మార్చింది.

మాస్ కథల్లో స్పెషల్ సాంగ్స్ ప్రాధాన్యతను బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా, ఈ పాటను కూడా భారీ స్థాయిలో మలిచారు. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే నిర్మాణ విలువలు, సెట్స్, కాస్ట్యూమ్స్, కలర్ ప్యాలెట్ సినిమాకి ఉన్న గ్రాండియర్‌ను ప్రజెంట్ చేస్తున్నాయి.

‘హల్లల్లల్లో’ ఈ ఏడాది అత్యంత మాస్, క్రేజీ పాటల్లో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. జూన్ 4న విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది’ పై ఈ పాట మరింత హైప్‌ను పెంచింది. థియేటర్లలో ఈ పాట వచ్చేసరికి విజిల్స్, క్లాప్స్, సెలబ్రేషన్స్‌తో ప్రేక్షకులు ఊగిపోవడం ఖాయమనేలా ‘హల్లల్లల్లో’ అలరిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.