ఇట్లు అర్జున ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Itlu Arjuna First Single Release Date Locked

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజికల్ జర్నీని ప్రారంభించిన మేకర్స్, మే 28న విడుదల కానున్న తొలి సింగిల్‌కు ‘హాయ్ రే’ అనే టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

పోస్టర్‌లో అనీష్, అనస్వర రాజన్‌ల మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిటికీ పక్కన తన ఆలోచనల్లో మునిగిపోయిన అనస్వరను, బయట కూర్చొని మౌనంగా ప్రేమతో చూస్తున్న అనీష్ లుక్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇది ఒక సినిమా పోస్టర్ కంటే నిజ జీవితంలోని మధురమైన క్షణంలా అనిపిస్తూ ప్రేమను ఎంతో సహజంగా చూపిస్తోంది.

పోస్టర్‌ చూస్తుంటే ‘హాయ్ రే’ పాట తొలి ప్రేమలో కలిగే మధురమైన అనుభూతులను, సున్నితమైన భావోద్వేగాలను, హృద్యమైన రొమాంటిక్ మూడ్‌ను ఆవిష్కరించబోతున్నట్టు స్పష్టమౌతుంది. మెలోడీ ప్రేమికులను ఆకట్టుకునే ఈ పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.