చిరు 158 సినిమాకి ముహూర్తం ఫిక్స్

muhurtham fixed for chiranjeevis 158th film

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సక్సెస్‌ఫుల్ దర్శకుడు బాబీ కొల్లి‌తో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #ChiruBobby2 / #Chiru158 మే 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రకటనను చిరంజీవి స్వయంగా ఒక పవర్‌ఫుల్ జిమ్ వీడియో ద్వారా రివిల్ చేశారు. ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్, ఇంటెన్స్ వర్కౌట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసం ఆయన పడుతున్న కష్టం, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చేస్తున్న ట్రైనింగ్ ఈ సినిమాలో ఉండబోయే హై-వోల్టేజ్ యాక్షన్‌కు హింట్ ఇస్తోంది.

వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… గెట్టింగ్ రెడీ ఫర్ 158.. బాబీ.. మే 21 ముహూర్తం.. KVN ప్రొడక్షన్స్ వారిది..అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో కలుస్తున్నాం. గెట్ రెడీ” .

ఎక్స్‌ప్లోసివ్ పవర్, ఫంక్షనల్ స్ట్రెంగ్త్, స్టామినా మీద ఫోకస్ చేసిన ఆ ట్రైనింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన తర్వాత సినిమాలపై చిరంజీవి గారి ప్యాషన్ మరోసారి స్పష్టమౌతోంది. ప్రతి వర్కౌట్‌లో కనిపిస్తున్న ఆ ఇంటన్సిటీ, తెరపై మరొకసారి ఎలక్ట్రిఫై చేసే పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఆయన తపన ఇంకా పెరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, లుక్ టెస్ట్ ఇమేజ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మాస్ ఎలిమెంట్స్‌తో కథలను పవర్‌ఫుల్‌గా తెరకెక్కించడంలో పేరున్న బాబీ కొల్లి, ఈసారి చిరంజీవిని మరింత ఇంటెన్స్, పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు. ఈ చిత్రం భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలక్ట్రిఫై చేసే ఎలివేషన్స్, అభిమానులను అలరించే మాస్ మూమెంట్స్‌తో ఉండబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.