సింగ్ గీతం మంచి ఫన్ సినిమా – నాగ్ అశ్విన్

Nag Ashwin Calls Sing Geetham a Complete Fun Entertainer

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ‘సింగ్ గీతం’ తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించబడిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు.

ఈ చిత్రం సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందిస్తుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ఒక దిగ్గజ దార్శనికుడిని, లెజండరీ నిర్మాణ సంస్థను ఒకచోట చేర్చింది. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి హలో బాసు సాంగ్ లాంచ్ చేశారు. ‘హలో బాసు’ సాంగ్ పూర్తి స్థాయి ఫన్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. మాటలే పాటగా మారిపోయే కాన్సెప్ట్ ఈ సాంగ్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ క్యాచీగా ఉండటమే కాకుండా, వినగానే హమ్ చేయించేలా ఉంది. సింగర్స్ వంశీ, ఆర్.పీ. కృష్ణాంగ్ తమ ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు అదిరిపోయే వైబ్ తీసుకొచ్చారు.

దేవి శ్రీ ప్రసాద్‌తో పాటు ఉత్తాన భారిఘాట్ రాసిన లిరిక్స్ సరదాగా, ట్రెండీగా ఉండి యూత్‌కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మొత్తం మీద ‘హలో బాసు’ ఫన్ రైడ్‌లా మారి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ థ్యాంక్యూ. ఇది మాకు చాలా స్పెషల్ అకేషన్. ఈ రోజు ఒక డిలీటెడ్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. కాకపోతే సినిమాకు తీసేయమని చెప్పారు(నవ్వుతూ) ఈ పాట కోసం మా దాసు చాలా కష్టపడ్డాడు. అందుకే ఈ సాంగ్‌ను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ ఈవెంట్ నిర్వహించాం. ఇది చాలా మంచి ఫన్ సినిమా. చాలా కొత్త ఎక్స్‌పెరిమెంట్. సింగీతం గారు ప్రతి సినిమాకీ కొత్తగా ఆలోచిస్తారు. ఇది ఆయన లాంగ్‌టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్. గత కొన్ని నెలలుగా ఆ కలను నిజం చేయడానికి మేమంతా ఎంతో కష్టపడి పని చేస్తున్నాం. ఈ సాంగ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇందులో ఎంత ఫన్ ఉందో. ‘జాతిరత్నాలు’ తర్వాత నేను నిర్మిస్తున్న సినిమా ఇది. ఆ సినిమాను ఎలా నవ్వుతూ ఎంజాయ్ చేశారో, ఈ సినిమాను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

వంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ‘దాసు’ అనే క్యారెక్టర్ చేశాను. ఆ పాత్ర చాలా కొత్తగా, చాలా ఫన్‌గా ఉంటుంది. ఇది మంచి ఫన్ సినిమా. సింగీతం గారి సినిమాలో అవకాశం రావడం జీవితంలో చాలా అరుదుగా దొరికే అవకాశం. ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

యూనిక్ కాన్సెప్ట్, ఫాంటసీ కథనంతో ‘సింగ్ గీతం’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతుంది. ఇది సింగీతం శ్రీనివాసరావు గారి వినూత్న ప్రయాణానికి మరో మైలురాయిగా నిలవనుంది.

ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంకూర్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ మూలే. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.