శరవేగంగా స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్ పోస్ట్ ప్రొడక్షన్

Post-Production of Slumdog - 33 Temple Road Progressing Rapidly

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిల భారీ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ నుంచి తాజాగా అప్‌డేట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ మరియు రీ-రికార్డింగ్ (RR) పనులు శరవేగంగా సాగుతున్నాయి.ఈ చిత్రానికి యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.దాంతో అంచనాలు భారీగా వున్నాయి.

పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్, విజయ్ సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి ఊర మాస్ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విష్ణు రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

పూరి కనెక్ట్స్ మరియు జె.బి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చార్మీ కౌర్, పూరి జగన్నాథ్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. త్వరలోనే ట్రైలర్ మరియు విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇక పూరి జగన్నాథ్ ఈ సినిమాతో ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ సేతుపతిని పూరి ఎంత మాస్‌గా చూపిస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.