రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ పై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. చాలా రోజుల తరువాత తెలుగులో వస్తున్న పెద్ద సినిమా కావడంతో హైప్ మాములుగా లేదు. ఇక ఈసినిమా భారీ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెద్ది నిడివి సుమారు 182 నిమిషాలుగా గా ఉండబోతున్నట్లు సమాచారం. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి, పాత్రల నేపథ్యం మరియు భావోద్వేగాలను పండించడానికి ఈ రన్ టైం అవసరమని దర్శకుడు బుచ్చిబాబు భావించినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.
జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయనున్నారు. భారీ నిడివి ఉన్నప్పటికీ, సినిమా గ్రిప్పింగ్గా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఈనెల 18న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడంతో ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్లే ఉంటే మొదటి రోజే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























