ఇలా జరుగుతుందని ఊహించలేదు -డైరెక్టర్ ఆర్జే బాలాజీ

Director Breaks Down in Tears Over Karuppu Release Issue

సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). ఈ సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు షోలు పడలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలా ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆఖరి నిమిషంలో వాయిదా పడటంపై ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినిమా చూడటానికి ఉదయం నుంచే థియేటర్ల వద్ద వేచి ఉన్న ప్రేక్షకులకు జరిగిన అసౌకర్యానికి ఎంతో బాధపడుతున్నానని, ఇలా జరుగుతుందని ఊహించలేదని కన్నీరు పెట్టుకున్నారు. సమస్యలన్నీ త్వరగా పరిష్కారమై, ఈరోజు సాయంత్రం 6 గంటల కల్లా షోలు పడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్ట సమయంలో సూర్య తనకు ఎంతో అండగా నిలుస్తున్నారని, సినిమా తప్పకుండా అందరి అంచనాలను అందుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇక ఓవర్సీస్ అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమా విడుదల ఆగిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ మరియు ఫైనాన్సియర్ల మధ్య నెలకొన్న ఆర్థిక లావాదేవీల సర్దుబాటులో జాప్యం జరగడం వల్ల రిలీజ్ నిలిచిపోయింది. ప్రభుత్వం నుండి ప్రత్యేక షోలకు అనుమతి లభించినప్పటికీ, ఈ అంతర్గత సమస్యల వల్ల వాటిని కోల్పోవాల్సి రావడం దర్శకుడిని మరింత బాధకు గురిచేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.