మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే గ్లింప్స్ మరియు పాటలతో అంచనాలను పెంచేసిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రమోషన్ల వేటను ప్రారంభించడానికి సిద్ధమైంది. సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండటంతో, చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన ప్రచార షెడ్యూల్‌ను ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెద్ది పవర్ ప్లే టూర్ :
చిత్ర బృందం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, మే 18 నుండి జూన్ 2 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రమోషన్లు జరగనున్నాయి.
మే 18: ముంబైలో ప్రచారానికి శ్రీకారం.
మే 22: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సందడి.
మే 23 & 24: వరుసగా భోపాల్ మరియు బెంగళూరు పర్యటనలు.
మే 28 & 30: ఢిల్లీ మరియు చెన్నైలలో ప్రమోషన్ కార్యక్రమాలు.
జూన్ 1 & 2: విజయనగరం మరియు చివరిగా తిరిగి హైదరాబాద్‌లో ముగింపు.
ప్రస్తుతానికి ప్రమోషన్ల షెడ్యూల్ ఖరారైనప్పటికీ, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. త్వరలోనే ట్రైలర్‌తో పాటు మరిన్ని భారీ అప్‌డేట్స్ లోడింగ్ అని టీమ్ పేర్కొంది. 8 రోజుల్లో 7 ప్రధాన నగరాలను చుట్టేసి, సినిమాపై ఉన్న హైప్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.జూన్ 4న సినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























