పెద్దిని నార్త్ లో రిలీజ్ చేయనున్న జియో స్టూడియోస్

Jio Studios Bags North India Rights for Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ నార్త్ ఇండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ కైవసం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిందీ , తెలుగు వెర్షన్ లను ఈసంస్థ నార్త్ ఇండియా లో విడుదల చేయనుంది.ఈ థియేట్రికల్ హక్కులను జియో స్టూడియోస్ భారీ ధరకు దక్కించుకుంది. ఇటీవలే ‘ధురంధర్’ సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న జియో స్టూడియోస్, ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్‌ను వాడుకుని ఈ సినిమాను హిందీ బెల్ట్‌లో అత్యంత భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

1980ల కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో రామ్ చరణ్ ‘పెద్ది పహిల్వాన్’గా కనిపిస్తారు. కుస్తీ, క్రికెట్వంటి క్రీడల చుట్టూ ఈ కథా గమనం సాగుతుందని సమాచారం.

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది.

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈనెల 18న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అంతకుముందు రోజు జూన్ 3న అమెరికాలో భారీ ఎత్తున ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.