పెద్ది ఫైనల్ ఎడిట్ లాక్ 

Peddi Wraps Final Editing Process

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’తో వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన ‘పెద్ది’ ఫైనల్ ఎడిట్‌ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. షార్ఫ్, ఎమోషనల్ డెప్త్ తీసుకురావడంలో పేరుపొందిన జాతీయ అవార్డు గ్రహీత, ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బుచ్చి బాబు సానా గ్రేట్ విజన్ తో ‘పెద్ది’ ఎమోషన్, యాక్షన్, గ్రాండియర్ తో నిండిన ఒక భారీ సినిమాటిక్ అనుభూతిని అందించబోతుంది. 

ఈ సినిమా కోసం రామ్ చరణ్ కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన మేకోవర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టెక్నికల్‌గా ‘పెద్ది’ అత్యున్నత స్థాయిలో తెరకెక్కుతోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో పలు దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది.

అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ జూన్ 3 నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో ‘పెద్ది’ ఓ హిస్టారిక్ ఓపెనింగ్‌కి సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.