కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న భాగ్య శ్రీ

Bhagyashri Borse On Board for Seyon

తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన సెయాన్ లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు భాగ్యశ్రీ బర్త్ డే కావడంతో సినిమానుండి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ పోస్టర్‌లో భాగ్య శ్రీ విలేజ్ అమ్మాయి గెటప్ లో మెరిసిపోతుంది.

శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లెజెండరీ నటుడు కమల్ హాసన్ మరియు ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.

ఇక భాగ్యశ్రీ బోర్సే తెలుగులో రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో పరిచయమై ప్రేక్షకులను అలరించారు.రీసెంట్ గా మలయాళంలో కాంత అనే సినిమా కూడా చేసింది. ప్రస్తుతం ఆమె అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ అనే తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు. అటు కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, ఇటు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ సినిమాలతో ఈ ఏడాది ఆమె కెరీర్ కీలక మలుపు తిరుగుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.